తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​ 189/8- ఇషాంత్ పాంచ్​ పటాకా

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్​ పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్​లో వెస్టిండీస్‌ను ఇషాంత్‌ శర్మ(5/42) కట్టడి చేశాడు. రోస్టన్​ చేజ్​ (48; 74బంతుల్లో 5×4, 1×6) పట్టుదలతో ఆడి ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్‌ 108 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

By

Published : Aug 24, 2019, 6:26 AM IST

Updated : Sep 28, 2019, 1:53 AM IST

విండీస్​ 189/8- ఇషాంత్ పాంచ్​ పటాకా

భారత బౌలర్లు సత్తా చాటడం వల్ల విండీస్​తో జరుగుతున్న తొలి టెస్ట్​లో భారత్​ ముందంజలో ఉంది. ముఖ్యంగా ఇషాంత్​ శర్మ ధాటికి విండీస్​ బ్యాట్స్​మెన్​ విలవిలలాడారు. కెరీర్​లో మరో చక్కటి ప్రదర్శన కనబరిచాడు ఇషాంత్​. రెండో రోజు ఆట ముగిసే సరికి విండీస్​ 189/8 వద్ద ఉంది. భారత్​ 108 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఆరంభం దొరికినా..

విండీస్‌ ఇన్నింగ్స్‌ మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలవలేకపోయింది. బ్రాత్‌వైట్‌తో ఓపెనింగ్‌కు దిగిన క్యాంప్‌బెల్‌ (23; 30బంతుల్లో 4×4) చక్కటి షాట్లు ఆడాడు. కానీ ఎనిమిదో ఓవర్‌లో షమి బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కుదురుకున్నట్లే కనిపించిన బ్రాత్‌వైట్‌ (14)ను ఇషాంత్‌ బోల్తా కొట్టించాడు. బ్రూక్స్ (11) జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో రహానె చేతికి చిక్కాడు. అప్పటికి విండీస్​ స్కోరు 50 పరుగులు.

నిలబెట్టిన చేజ్‌..

తక్కువ పరుగులు వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్‌ను రోస్టన్​ చేజ్‌ ఆదుకున్నాడు. డారెన్‌ బ్రావో (18)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. టీ బ్రేక్‌ సమయానికి విండీస్‌ 82/3తో కాస్త మెరుగ్గానే కనిపించింది. కానీ బుమ్రా ఈ జోడీని విడదీశాడు. 30వ ఓవర్‌లో మొదటి బంతికే బ్రావోను ఎల్బీగా ఔట్‌ చేశాడు.

తర్వాత షై హోప్‌తో చేజ్‌ గొప్ప పోరాటమే చేశాడు. భారత బౌలర్లను చక్కగా ఎదుర్కొంటూ స్వేచ్ఛగా ఆడే ప్రయత్నం చేశాడు. అర్ధశతకానికి చేరువయ్యే క్రమంలో ఇషాంత్‌ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 42 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది.

ఇషాంత్‌ కట్టడి..

విండీస్‌ తరఫున షై హోప్‌, హెట్‌మైయర్‌ జోడీ మరో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చక్కటి సమన్వయంతో చెత్త బంతుల్ని మాత్రమే బాదుతూ వీరిద్దరూ ఇన్సింగ్స్‌ను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. కానీ లంబూ వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. తక్కువ పరుగుల వ్యవధిలో వీరిని కూడా ఔట్‌ చేశాడు. 54వ ఓవర్‌ ఆఖరి బంతికి షై హోప్‌ (24; 65బంతుల్లో 1×4), 56వ ఓవర్‌లో మూడో బంతికి హెట్‌మైయర్‌ (35; 47బంతుల్లో 3×4), ఆఖరి బంతికి రోచ్‌(0)లను వెంటవెంటనే ఔట్‌ చేసి విండీస్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో కెప్టెన్‌ హోల్డర్‌ (10), కమిన్స్ (0) ఉన్నారు.

అంతకుముందు భారత్​ తొలి ఇన్నింగ్స్​లో 297 పరుగులకు ఆలౌటయింది.

రికార్డులు...

బుమ్రా
  1. * బ్రావోను పెవిలియన్‌కు పంపడం ద్వారా బుమ్రా టెస్టు క్రికెట్‌లో 50 వికెట్ల ఖాతాలో చేరాడు. 11 టెస్టుల్లోనే అతని ఈ రికార్డు అందుకోవడం విశేషం.
  2. * భారత్‌ తరఫున తక్కువ మ్యాచ్‌ల్లో (11).. 50 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్‌ బౌలర్‌గా బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు.
  3. * టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇషాంత్‌కిది తొమ్మిదోసారి. వెస్టిండీస్‌పై మూడోసారి.
Last Updated : Sep 28, 2019, 1:53 AM IST

ABOUT THE AUTHOR

...view details