మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో యువ క్రికెటర్ ఇషాన్ కిషన్.. తన బ్యాట్‌కు పని చెప్పాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఝార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్.. శనివారం మధ్యప్రదేశ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. కేవలం 94 బంతుల్లోనే 173 పరుగులు చేశాడు. ఇందులో 19 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. టోర్నీలో ఇది ఏడో అత్యధిక స్కోరుగా నమోదైంది..
ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్.. 94 బంతుల్లో 173 రన్స్ - ఇషాన్ కిషన్ వార్తలు
విజయ్ హజారే ట్రోఫీలో ఝార్ఖండ్ యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆడిన 94 బంతుల్లో 173 పరుగులు చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ ముందట తమ క్రికెటర్ ప్రదర్శన పట్ల ముంబయి ఇండియన్స్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
![ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్.. 94 బంతుల్లో 173 రన్స్ Ishan Kishan sets Vijay Hazare Trophy on fire with astonishing 94-ball 173](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10703075-thumbnail-3x2-ishan-hd.jpg)
ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్.. 94 బంతుల్లో 173 రన్స్
అంతకుముందు, కేరళ జట్టుకు చెందిన బ్యాట్స్‌మన్ సంజు సామ్సన్ 129 బంతుల్లో 212 పరుగుల రికార్డు ఈ జాబితాలో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత అత్యధికంగా యశస్వీ జైస్వాల్ (154 బంతుల్లో 203 రన్స్), కర్ణ్ కౌశల్ (202 పరుగులు) ఉన్నారు.
ఇదీ చూడండి:మొతేరా జిమ్‌లో కోహ్లీ కసరత్తులు.. పంత్ విన్యాసాలు