హర్మన్‌ప్రీత్ కౌర్.. ప్రస్తుతం టీమిండియా మహిళా టీ20 జట్టు కెప్టెన్. అయితే ఈ మెగాటోర్నీలో తాజాగా ఫైనల్ చేరింది భారత్. ఫలితంగా మార్చి 8న మెల్బోర్న్ వేదికగా తుదిపోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇదే రోజున ఈ క్రికెటర్ పుట్టినరోజు కావడం వల్ల టీమిండియాలో మరింత జోష్ పెరిగింది. ఆమెకు కప్‌ను బహుమతిగా ఇవ్వాలని సహఆటగాళ్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు చరిత్రలో ఏ క్రికెటర్ బర్త్‌డే రోజున టైటిల్ పోరు జరగలేదు. ఈ ఘనత సాధించిన తొలి మహిళ హర్మన్ కావడం విశేషం. ఇదే రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం అవ్వడం గమనార్హం.
ఇద్దరి జెర్సీ ఒక్కటే...