కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చాలా క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. మరికొన్ని రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ నిర్వహణ తేదీలను మార్చారు. ఈనెల 29 నుంచి ప్రారంభం కావాల్సిన లీగ్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. అయితే అప్పుడైనా జరుగుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ప్లాన్-బితో ముందుకెళ్లే ఆలోచనలో ఉంది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).
జులై నుంచి సెప్టెంబరు మధ్యలో?
తాజా సమాచారం మేరకు ఐపీఎల్‌ను పూర్తిగా(60 మ్యాచ్‌లు) నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. రానున్న జులై-సెప్టెంబరు మధ్యలో ఈ టోర్నీని జరపాలని అనుకుంటోంది. అయితే స్వదేశం లేదా విదేశాల్లో జరపాలా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఆ సమయంలో కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా సరే టోర్నీని జరపాలని పట్టుదలతో ఉంది. అప్పుడు వివిధ దేశాల మధ్య ఆరు నుంచి ఏడు సిరీస్‌లు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
క్రీడాటోర్నీలకు 2020 ముఖ్యమైన ఏడాది. జూన్-జులై, జులై-ఆగస్టు నెలల్లో యూరో కప్, టోక్యో ఒలింపిక్స్ జరగాల్సి ఉన్నాయి. యూరోకప్ను ఇప్పటికే వాయిదా వేయగా, ఒలింపిక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనైనా జరిపి తీరుతామని ఒలింపిక్ కమిటీ అంటోంది. అక్టోబరులో జరగాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది.
2019 ఐపీఎల్ విజేత ముంబయి ఇండియన్స్ ఇదీ చూడండి..'టీమిండియాలోకి ధోనీ రీఎంట్రీ కష్టమే'