పిల్లలతో ఆడుకోవడమంటే ఎవరికైనా సరదానే. వాళ్లతో ఆహ్లాదంగా గడిపేందుకు ఎంతగొప్పవారైనా సరే ఇష్టపడుతుంటారు. తమ హోదాను మర్చిపోయి వారితో కలిసిపోతారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కుమారుడు ఇమ్రాన్‌తో ఆహ్లాదంగా గడిపాడు. ఆ చిన్నారితో సరదాగా బాక్సింగ్ చేశాడు. బుల్లి పఠాన్ కండలు తనకంటే దృఢంగా ఉన్నాయని కితాబిచ్చాడు.
సచిన్‌తో తన కొడుకు ఇమ్రాన్ గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నాడు పఠాన్. ఆ వీడియోను ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.