తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అలాంటి స్టేట్​మెంట్లు చదివి.. కాసేపు నవ్వుకోండి' - Irfan Pathan's Veiled Dig At Ex-Pakistan Cricketer For Jasprit Bumrah "Baby Bowler" Comment

పేసర్​ బుమ్రాపై రజాక్​ చేసిన వ్యాఖ్యల్లాంటి వాటిని చదివి, స్పందించాల్సిన అవసరం లేదని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్​ పఠాన్ అన్నాడు. కాసేపు నవ్వుకుంటే చాలన్నట్లుగా ఏమోజీని ట్వీట్ చేశాడు.

'అలాంటి స్టేట్​మెంట్లు చదివి.. నవ్వుకోండి'
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్​ పఠాన్

By

Published : Dec 7, 2019, 5:15 AM IST

భారత స్టార్ పేసర్​ బుమ్రాను.. బేబీ బౌలర్​ అని ఇటీవలే వార్తల్లో నిలిచాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. ఆ తర్వాత అతడిపై సోషల్​ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అతడి ఆటపైనా ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు భారత మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్ పఠాన్.. రజాక్​పై వ్యంగాస్త్రాలు సంధించాడు. టీమిండియా అభిమానులు.. అలాంటి స్టేట్​మెంట్లకు స్పందించాల్సిన అవసరం లేదని, చదివి నవ్వకుంటే చాలని ట్వీట్ చేశాడు.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రజాక్.. మెక్​గ్రాత్, వసీమ్ అక్రమ్ లాంటి మేటి పేసర్లతో పోలిస్తే బుమ్రా ఓ బచ్చా బౌలర్​ అని అన్నాడు. అతడి బౌలింగ్​ను సులభంగా ఆడేస్తానని చెప్పాడు.

తన కెరీర్​లో రజాక్.. 46 టెస్టులు, 256 వన్డేలు, 32 టీ20ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ​ అన్ని ఫార్మాట్లలో కలిపి అతడి బ్యాటింగ్​ సరాసరి 30 కంటే తక్కువే.

బుమ్రా.. ఫిట్​నెస్ సమస్యల కారణంతో గత మూడు నెలలుగా క్రికెట్ ఆడకపోయినా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలోనే ఉన్నాడు. ప్రస్తుతం కసరత్తులు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ బౌలర్​.. త్వరలో న్యూజిలాండ్​తో జరిగే సిరీస్​కు అందుబాటులోకి వస్తాడని భారత బౌలింగ్​ కోచ్ భరత్ అరుణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details