తెలంగాణ

telangana

ETV Bharat / sports

సీపీఎల్​లో ఆడనున్న ఒకే ఒక్కడు ఇర్ఫాన్ పఠాన్

త్వరలో ప్రారంభం కానున్న సీపీఎల్(కరీబియన్ ప్రీమియర్ లీగ్​)లో ఇర్ఫాన్ పఠాన్ ఆటగాడిగా కనిపించనున్నాడు. తద్వారా విదేశీ లీగ్​ ఆడనున్న తొలి భారత క్రికెటర్​గా నిలిచాడు.

సీపీఎల్​లో ఆడనున్న ఒకే ఒక్కడు ఇర్ఫాన్ పఠాన్

By

Published : May 17, 2019, 9:36 AM IST

ఐపీఎల్​ ముగిసింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ త్వరలో ప్రారంభం కానుంది. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ లీగ్​లో ఆటగాడిగా కనిపించనున్నాడు. తద్వారా విదేశీ లీగ్​లో ఆడబోతున్న తొలి భారతీయ క్రికెటర్​గా నిలవనున్నాడు.

ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా తరఫున 2012లో చివరి అంతర్జాతీయ మ్యాచ్​ ఆడాడు. ఆ తర్వాత జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. అదే విధంగా ఐపీఎల్​లో 2017లో గుజరాత్ లయన్స్​కు ప్రాతినిధ్యం వహించి చివరి మ్యాచ్​ ఆడాడు. అనంతరం జరిగిన రెండు సీజన్లలోనూ ఏ ప్రాంఛైజీ ఇతడ్ని తీసుకోలేదు.

'మా లీగ్‌ను బట్టి చాలా మంది క్రికెటర్స్ వారి పేర్లను రిజిష్టర్ చేసుకున్నారు. కరేబియన్ లీగ్‌లో ఆడే వారందరూ రాణించేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రతి సీజన్లాగే ఈ సారి లీగ్ అంతే రసవత్తరంగా సాగనుంది' -మిచెల్ హాల్, సీపీఎల్ టోర్నమెంట్ ఆపరేషన్స్ డైరక్టర్

20 దేశాల నుంచి 536 ఆటగాళ్లు పాల్గొనే ఈ టోర్నీలో ఆరు జట్లు ఉంటాయి. సీపీఎల్ 2018 టైటిల్‌ను ట్రిన్బాగో నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 12 వరకూ ఈ లీగ్ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details