భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ కొత్త జెర్సీల్లో దర్శనమిచ్చారు. శుక్రవారం నుంచి జరగనున్న రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఇండియా లెజెండ్స్ జెర్సీలు వీరిద్దరూ ధరించారు. ఈ ఫొటోను ఇర్ఫాన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాతి ఫొటో అంటూ క్యాప్షన్ జతచేశాడు.
శుక్రవారం మొదలయ్యే ఈ దిగ్గజాల క్రికెట్లో తొలి మ్యాచ్ ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగనుంది. భారత జట్టుకు సచిన్ తెందుల్కర్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన యూసుఫ్‌తో పాటు ఇర్ఫాన్ ఇండియా లెజెండ్స్ జట్టులో ఉన్నారు.