టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని తెలిపాడు. అయితే ఫ్రాంచైజి క్రికెట్, దేశవాళీ మ్యాచ్‌ల్లో అతడు ఆడే అవకాశముంది.
35 ఏళ్ల పఠాన్ 2019, ఫిబ్రవరిలో చివరి సారిగా జమ్ము కశ్మీర్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడాడు. గాయం కారణంగా ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టలేదు. 2020 ఐపీఎల్ వేలానికీ తన పేరు నమోదు చేసుకోలేదు.
ఇర్ఫాన్ పఠాన్ అనగానే గుర్తుకువచ్చేది. 2006లో పాకిస్థాన్‌పై హ్యాట్రిక్ వికెట్లు. మొదటి ఓవర్లోనే వరుసగా మూడు వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా పఠాన్ రికార్డు సృష్టించాడు.స్మలాన్ భట్, యూనిస్ ఖాన్, మహ్మద్ యూసఫ్ వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపించాడు. ఇర్ఫాన్ లాంటి బౌలర్లు పాక్‌లో గల్లీ గల్లీకి ఉంటారని విర్రవీగిన వారికి గట్టిగా బుద్ధి చెప్పాడు.