తెలంగాణ

telangana

ETV Bharat / sports

రికార్డులు బద్దలుకొట్టిన విండీస్​ వీరులు

ఐర్లాండ్​తో జరిగిన వన్డే మ్యాచ్​లో వెస్టిండీస్ ఓపెనర్లు.. షాయ్​ హోప్- క్యాంప్​బెల్​ జోడీ రికార్డుల పంట పండించింది. తొలి వికెట్​కు 365 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వీరిద్దరు.

By

Published : May 5, 2019, 8:53 PM IST

Updated : May 5, 2019, 11:33 PM IST

వన్డేల్లో మొదటి వికెట్​కు అన్ని పరుగులా..!

టీ20 ఫార్మాట్​ వచ్చిన తర్వాత వన్డేల్లో వేగం పెరిగింది. 50 ఓవర్ల ఫార్మాట్​లోనూ పరుగుల వరద పారిస్తున్నారు బ్యాట్స్​మెన్. నేడు డబ్లిన్ వేదికగా జరిగిన ఐర్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో రికార్డుల మోత మోగించారు వెస్టిండీస్​ ఓపెనర్లు.

మొదట బ్యాటింగ్​ చేసిన వెస్టిండీస్​ ఓపెనర్లు షాయ్ హోప్- జాన్ క్యాంప్​బెల్​​... మొదటి వికెట్​కు 365 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే చరిత్రలో ఇదే అత్యధికం. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్​ జోడీ ఫకార్ జమాన్-ఇమాముల్ హక్ పేరిట ఉంది. 2018లో జింబాబ్వేపై వీరిద్దరూ కలిసి 304 పరుగులు చేశారు.

రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన జాన్ కేంప్​బెల్-షాయ్ హోప్ జోడీ

వన్డేల్లో ఏ వికెట్​కైనా ఈ మ్యాచ్​లో హోప్​-క్యాంప్​బెల్​ల భాగస్వామ్యమే రెండో అత్యుత్తమం. మరో 8 పరుగులు చేసుంటే అత్యధిక భాగస్వామ్యం చేసిన జోడిగా అరుదైన ఘనత సాధించేవారు కరీబియన్లు.

ట్వీట్ చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి

వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం ఇదే

  • 2015లో జింబాబ్వేతో మ్యాచ్​లో రెండో వికెట్​కు 372 పరుగులు జోడించారు గేల్- మర్లోన్ శ్యాముల్స్.

వీరిద్దరి భాగస్వామ్యానికి మరో రికార్డు

  • వన్డే ఫార్మాట్​లో ఇద్దరు ఓపెనర్లు 150కు పైగా పరుగులు చేసింది ఈ మ్యాచ్​లోనే.
  • క్యాంప్​బెల్​.. 137 బంతుల్లో 179 పరుగులు చేయగా, షాయ్ హోప్.. 152 బంతుల్లో 170 పరుగులు చేశాడు.
  • వీరిద్దరూ కలిసి 8 సిక్స్​లు, 37 ఫోర్లు కొట్టారు.

50 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లకు 381 పరుగులు చేసింది వెస్టిండీస్ జట్టు. ఐర్లాండ్​ జట్టులో ఒక్క బౌలర్​ మాత్రమే ఆకట్టుకున్నాడు. 10 ఓవర్లు బౌలింగ్​ చేసిన బ్యారీ మెకర్తీ.. 76 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

బంగ్లాదేశ్, ఐర్లాండ్, వెస్టిండీస్ మధ్య ముక్కోణపు సిరీస్ జరుగుతోంది. ఫైనల్​తో కలిపి మొత్తం ఏడు మ్యాచులు జరుగుతాయి.

Last Updated : May 5, 2019, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details