తెలంగాణ

telangana

ETV Bharat / sports

'యూఏఈలోనే ఐపీఎల్.. ప్రభుత్వ అనుమతి కోరాం' - 'యూఏఈలోనే ఐపీఎల్.. ప్రభుత్వ అనుమతి కోరాం'

కరోనా కారణంగా టీ20 ప్రపంచకప్ వాయిదాపడింది. ఫలితంగా ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమమైంది. అయితే ఈ లీగ్ ఎక్కడ జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు. తాజాగా దీనిపై స్పందించారు పాలకమండలి ఛైర్మన్ బ్రిజేష్ పటేల్.

'యూఏఈలోనే ఐపీఎల్.. ప్రభుత్వ అనుమతి కోరాం'
'యూఏఈలోనే ఐపీఎల్.. ప్రభుత్వ అనుమతి కోరాం'

By

Published : Jul 21, 2020, 7:40 PM IST

కరోనా కారణంగా అక్టోబర్-నవంబర్​లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఫలితంగా ఆ సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. అయితే భారత్​లో కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టకపోవడం వల్ల ఈ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. తాజాగా ఈ విషయమై స్పష్టతనిచ్చారు ఐపీఎల్ పాలకమండలి ఛైర్మన్ బ్రిజేష్ పటేల్.

"ఐపీఎల్​ను యూఏఈలో నిర్వహించాలని ఆలోచిస్తున్నాం. అందుకోసం ప్రభుత్వ అనుమతి కూడా కోరాం. త్వరలో జరగబోయే పాలకమండలి సమావేశంలో దీనిపై ఓ స్పష్టత వస్తుంది."

-బ్రిజేష్ పటేల్, ఐపీఎల్ పాలకమండలి ఛైర్మన్

ఇప్పటికే ఈ లీగ్​ కోసం ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫ్రాంచైజీలు కూడా తమ ఏర్పాట్లను ప్రారంభించుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details