తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్​ వల్ల ఎంతో మందికి జీవనోపాధి' - యుఏఈలో ఐపీఎల్​

ఐపీఎల్​ను నిర్వహించడం ద్వారా అభిమానుల్లో ఉత్సాహం సహా టోర్నీ జరిపే దేశం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని మాజీ క్రికెటర్​ సంగక్కర చెప్పాడు. లీగ్ వల్ల చాలా మందికి పని దొరుకుతుందని అన్నాడు.

IPL will bring about a sense that everything is back to normal: Kumar Sangakkara
'ఐపీఎల్​ వల్ల ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారు'

By

Published : Jul 26, 2020, 11:44 AM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​)పై ప్రశంసలు కురిపించాడు శ్రీలంక మాజీ కెప్టెన్​ కుమార సంగక్కర. ఈ టోర్నీకి చాలా ప్రాముఖ్యం ఉందని, దీని వల్ల ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారని చెప్పాడు. యుఏఈలో లీగ్​ నిర్వహణ వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డాడు.

"క్రీడలు దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంలో ప్రధాన భాగమవుతాయి. ఐపీఎల్​తో ఆర్థిక ప్రయోజనం కోసమే కాకుండా,​ అభిమానులకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. టీవీలో మ్యాచ్​లను చూడటం ద్వారా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయనే భావన కలుగుతుంది. అయితే ప్రస్తుతం పూర్తి భిన్నంగా ఉంది. విదేశీ ప్రయాణాలతో బీసీసీఐ అనేక సవాళ్లను ఎదుర్కోనుంది. బయో సెక్యూర్​ వాతావరణంలో మ్యాచ్​లను నిర్వహించడం వల్ల టీవీల్లో చూసి యువతపై సానుకూల ప్రభావం పడనుంది. ఐపీఎల్​ వల్ల ఆటగాళ్లు, సర్వీసు ప్రొవైడర్లు, ప్రసారదారులే కాకుండా మరెంతో మందికి జీవనోపాధి లభిస్తుంది"

- కుమార సంగక్కర, శ్రీలంక మాజీ కెప్టెన్​

యుఏఈలో ఐపీఎల్​ను నిర్వహించడం వల్ల ఆ దేశానికి ఆదాయం రావడం సహా అక్కడున్న అనేక మందికి పరోక్షంగా పని దొరుకుతుందని సంగక్కర అభిప్రాయపడ్డాడు.

భారత దేశంలో కరోనా కేసులు క్రమంగా అరబ్ దేశంలో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్​ జరపనున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ వాయిదా పడటం వల్ల ఈ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతకుముందు ​2009, 2014లోనూ ఐపీఎల్​ను విదేశాల్లో నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details