కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించారు. అయినా సరే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. గతేడాదితో పోలిస్తే 23 శాతం ఎక్కువగా టీవీల్లో వీక్షించారు. ఈ విషయాన్ని ప్రసారసంస్థ స్టార్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. 31.57 మిలియన్ల వీక్షణలు నమోదైనట్లు వెల్లడించింది. హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వ్యూయర్షిప్ బాగా పెరిగిందని స్పష్టం చేసింది.
టీవీల్లోనూ ఐపీఎల్ వ్యూయర్షిప్ అదరహో - ఐపీఎల్ వ్యూయర్షిప్
ఈసారి ఐపీఎల్ అంచనాలకు మించి అలరించింది. గతేడాదితో పోలిస్తే 23 శాతం అధికంగా టెలివిజన్ వ్యూయర్షిప్ సొంతం చేసుకుందని ప్రసారదారు సంస్థ స్టార్ ఇండియా పేర్కొంది.
ఐపీఎల్ వ్యూహర్షిప్ అదుర్స్..
ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి మళ్లీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి, మొత్తంగా ఐదోసారి ట్రోఫీ అందుకుని తిరుగులేని రికార్డులు సృష్టించింది.