ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించనున్న మూడు వేదికల్లో ఒకటైన షార్జా క్రికెట్ స్టేడియాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సందర్శించారు. ఈ క్రమంలోనే మైదానానికి జోడించిన నూతన హంగులను చూసి ముగ్ధుడయ్యారు. సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్ వంటి గొప్ప క్రికెటర్లు చరిత్ర సృష్టించిన ఈ క్రికెట్ మైదానంలో ఆడేందుకు యువ ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని గంగూలీ తెలిపారు.
ఈ పర్యటనలో గంగూలీతో పాటు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్, మాజీ చీఫ్ రాజీవ్ శుక్లా, సీఈఓ హేమాంగ్ అమిన్ పాల్గొన్నారు.