తెలంగాణ

telangana

ETV Bharat / sports

భాగ్యనగరంలో ఐపీఎల్ ట్రోఫీ సందడి - క్రికెట్

హైదరాబాద్​లో ఐపీఎల్ ట్రోఫీ సందడి చేస్తోంది. బంజారాహిల్స్​లోని ఓ మాల్​లో ప్రదర్శనకు ఉంచిన ఈ కప్పును చూసేందుకు క్రికెట్​ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఐపీఎల్ ట్రోఫీ

By

Published : Apr 1, 2019, 12:54 PM IST

ఓ వైపు ఐపీఎల్ 12వ సీజన్ అలరిస్తోంది. మరోవైపు ప్రచారంలో భాగంగా ట్రోఫీ.. దేశం చుట్టివస్తోంది. మార్చి 15న దిల్లీలో ప్రారంభమైన ఈ యాత్ర.. బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాల్లో పూర్తి చేసుకుని భాగ్యనగరానికి విచ్చేసింది.

హైదరాబాద్ లో ఐపీఎల్ ట్రోఫీ

ఈ ట్రోఫీని బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. తిలకించేందుకు క్రికెట్‌ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. సరదాగా కాసేపు క్రికెట్‌ ఆడారు. ఏప్రిల్‌ 7న జైపూర్‌లో ఈ యాత్ర ముగియనుంది.

ABOUT THE AUTHOR

...view details