ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకున్న వివో స్థానంలోకి వచ్చేందుకు టాటా మోటార్స్, డ్రీమ్ ఎలెవన్, అన్అకాడమీ సహా పలు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. అయితే వీటిని ఆగస్టు 18న తెరుస్తారు. వేలంపాటలో అత్యధికంగా కోట్ చేసిన సంస్థకి, టోర్నమెంట్‌పై ఆ బ్రాండ్ చూపే ప్రభావాన్ని బట్టే ఆ సంస్థకు ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ దక్కనుంది.
దేశంలో కొన్ని నెలలుగా చైనా వ్యతిరేక ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన వివో ఈ ఏడాదికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంది. ఆ సంస్థ ఏటా బీసీసీఐకి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. అయితే ఇంత మొత్తంలో కాకపోయినా దాదాపు 300-400 కోట్ల వరకు నేడు స్పాన్సర్ షిప్ దక్కించుకోనున్న సంస్థ నుంచి వస్తాయని సమాచారం అందుతోంది. దీంతో బోర్డుకు ఉపశమనం దక్కినట్టైంది.