తెలంగాణ

telangana

ETV Bharat / sports

రైజర్స్ వర్సెస్ రైడర్స్... గెలుపెవరిది

ఐపీఎల్ రెండో మ్యాచ్​లో కోల్​కతా, హైదరాబాద్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. వార్నర్ రాకతో సన్​రైజర్స్​ బలంగా కనిపిస్తుండగా కార్తీక్​ సారథ్యంలోని కోల్​కతా నైట్​రైడర్స్​ మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది.

By

Published : Mar 24, 2019, 8:59 AM IST

ఐపీఎల్

ఓ సారి కప్పు గెలిచి.. గత సీజన్​లో రన్నరప్​గా నిలిచిన జట్టు ఓ వైపు... రెండు సార్లు ఐపీఎల్ విజేత, ఈ సారి టైటిల్ ఫేవరెట్​గా బరిలో దిగుతున్న జట్టు మరోవైపు. ఐపీఎల్ 2019 సీజన్​ రెండో మ్యాచ్​లో నేడు సన్​రైజర్స్ హైదరాబాద్, కోల్​కతా నైట్​ రైడర్స్ తలపడనున్నాయి. కోల్​కతా ఈడెన్​ గార్డెన్స్​లో ఈ మ్యాచ్​ జరగనుంది.

ఏడాది పాటు క్రికెట్​కు దూరంగా ఉన్న వార్నర్ పునరాగమనం చేయనుండగా, ఐపీఎల్​లో సత్తా చాటి ప్రపంచకప్​లో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు దినేశ్ కార్తీక్.

ఈ రెండు జట్లు ముఖాముఖి 15 సార్లు తలపడగా కోల్​కతానే ఎక్కువ మ్యాచ్​ల్లో విజయం సాధించింది. నైట్​రైడర్స్​ 9 సార్లు గెలవగా, సన్​రైజర్స్​ 6 సార్లు నెగ్గింది. గతేడాది కోల్​కతాను ఓడించి ఫైనల్​ చేరింది హైదరాబాద్. ఈ ఏడాది కూడా దినేశ్ కార్తీక్ సారథ్యంలోనే నైట్​రైడర్స్ బరిలో దిగనుంది. హైదరాబాద్ జట్టుకు విలియమ్సన్​ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

కోల్​కతా నైట్​రైడర్స్ ...

బలాలు:దినేశ్ కార్తీక్ గత సీజన్​లో 498 పరుగులు చేసి జట్టును మూడో స్థానంలో నిలిపాడు. ఓపెనర్లు క్రిస్​ లిన్, సునీల్ నరైన్​ జట్టుకు అదనపు బలం. ఇద్దరూ భారీ షాట్లు ఆడగల సమర్థులు. సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్ లాంటి అత్యుత్తమ స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. మిడిల్ ఆర్డర్​లో రసెల్, బ్రాత్​వైట్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

బలహీనతలు: పేస్ విభాగం కొంచెం బలహీనం. విండీస్ ఆల్​రౌండర్లు బ్రాత్​వైట్, రసెల్ ఉన్నప్పటికీ గత సీజన్​లో అంతగా ప్రభావం చూపలేదు.

సన్​రైజర్స్ హైదరాబాద్
బలాలు:డేవిడ్ వార్నర్ పునరాగమనం జట్టుకు కలిసొచ్చే అంశం. మార్టిన్ గప్తిల్, కేన్ విలియమ్సన్​లతో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. భువనేశ్వర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, కౌల్, ఖలీల్ అహ్మద్​లతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. గత రెండు సీజన్​లలో ఆరెంజ్ క్యాప్ సన్ రైజర్స్ ఆటగాళ్లకే దక్కడం (వార్నర్, విలియమ్స్​న్) విశేషం.

బలహీనతలు: మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది. యూసఫ్ పఠాన్, మనీశ్ పాండే, సాహాలు ఫామ్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఓపెనర్​ శిఖర్​ ధావన్​ దిల్లీ వెళ్లగా ధావన్ స్థానంలో విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్, అభిషేక్ శర్మలను తీసుకుంది సన్​రైజర్స్. వీరు ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

జట్లు..

కోల్​కతా నైట్​ రైడర్స్:దినేశ్ కార్తీక్​(కెప్టెన్​), రాబిన్ ఊతప్ప, క్రిస్​లిన్, శుభ్​మన్​ గిల్​, ఆండ్రీ రసెల్​, కార్లోస్​ బ్రాత్​వైట్​, సునీల్ నరైన్​, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్​, నిఖిల్​ యాదవ్, జోయ్​ డెన్లై, శ్రీకాంత్​ ముండే, నితిశ్ రానా, సందీప్​ వారియర్​, ప్రసిధ్ కృష్ణ, లోకీ ఫెర్గ్యూసన్​, హ్యారీ గుర్నే, కేసీ కరియప్ప, యర్రా పృథ్వీరాజ్​.

హైదరాబాద్ సన్​ రైజర్స్​: కేన్ విలియమ్సన్​(కెప్టెన్​), మనీశ్ పాండే, మార్టిన్ గప్తిల్​, రికీ భూయ్, డేవిడ్ వార్నర్​, దీపక్ హూడా, మహమ్మద్ నబీ, యూసుఫ్ పఠాన్​, షకీబ్ అల్ హసన్​, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్​, శ్రీవత్స్​ గోస్వామి, బెయిర్​స్టో, వృద్ధిమాన్ సాహా, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, బసీల్ థంపీ, బిల్లి, టి.నటరాజన్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్.

మ్యాచ్ ప్రారంభం : సాయంత్రం 4 గంటలకు

ABOUT THE AUTHOR

...view details