వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం బీసీసీఐ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లు ఐపీఎల్లో ఆడాల్సి ఉంటే.. వారికి ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. వారు ఒక బబుల్ నుంచి మరో బబుల్‌లోకి వెళ్తున్నందున నిర్బంధం అవసరం లేదని తెలిపింది.
'ఐపీఎల్ కోసం వాళ్లకు క్వారంటైన్ అవసరం లేదు!' - ఐపీఎల్2021పై కరోనా ప్రభావం
ఐపీఎల్-2021 కోసం కొత్త మార్గదర్శకాలను బీసీసీఐ విడుదల చేసింది. భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో ప్రస్తుతం బుడగలో ఉన్న ఆటగాళ్లకు క్వారంటైన్ అవసరం లేదని స్పష్టం చేసింది.
!['ఐపీఎల్ కోసం వాళ్లకు క్వారంటైన్ అవసరం లేదు!' IPL SOP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11092177-thumbnail-3x2-111.jpg)
ఐపీఎల్ 2021: బీసీసీఐ నూతన మార్గదర్శకాలు
ప్రయాణ ఏర్పాట్లపై బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంతృప్తి చెందితే.. ఆటగాళ్లు నేరుగా బయో బుడగలోకి ప్రవేశించవచ్చని బీసీసీఐ పేర్కొంది. అదేవిధంగా.. బయో బుడగల్లో ముందస్తు శిబిరాలను కలిగి ఉన్న అన్ని ఫ్రాంఛైజీలు సంతృప్తికరంగా ఉంటే బబుల్ నుంచి బబుల్‌కు బదిలీ చేయవచ్చని తెలిపింది.
ఇదీ చూడండి:అత్యధిక టీ20 పరుగుల జాబితాలో రోహిత్@2