తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్​ వీరి మధ్యే! - ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

By

Published : Sep 6, 2020, 4:47 PM IST

Updated : Sep 6, 2020, 5:52 PM IST

16:50 September 06

ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

ఐపీఎల్ షెడ్యూల్

క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. అబుదాబి వేదికగా ఈనెల 19న ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే పోరుతో లీగ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ తర్వాత రోజు దుబాయి వేదికగా దిల్లీ క్యాపిటల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనున్నాయి. మూడో మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది.

ఆ తర్వాత షెడ్యూల్ షార్జాకు మారుతుంది. అక్కడ 22న రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మొత్తం ఈసారి 10 డబుల్ హెడర్స్ ఉన్నాయి. మొదటి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30గంటలకు, రెండో మ్యాచ్​ రాత్రి 7.30లకు ప్రసారం అవుతాయి. దుబాయ్​లో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్​లు జరగనున్నాయి.

16:07 September 06

ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

ఐపీఎల్ షెడ్యూల్

.

Last Updated : Sep 6, 2020, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details