ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షెడ్యూలును శుక్రవారం విడుదల చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చెప్పాడు. "షెడ్యూలు ఆలస్యమైన మాట నిజమే. శుక్రవారం విడుదల చేస్తాం" అని ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ వెల్లడించాడు. అయితే పూర్తి షెడ్యూలును విడుదల చేస్తారా? లేదా భాగాలు విడుదల చేస్తారా? అన్నది తెలియలేదు. తొలి మ్యాచ్ ఈ నెల 19న ఆరంభం కానుంది.
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేది శుక్రవారమే: గంగూలీ - సౌరవ్ గంగూలీ గంగూలీ లేటెస్ట్ న్యూస్
ఐపీఎల్ షెడ్యూల్ శుక్రవారం(సెప్టెంబరు 4) రానుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టత ఇచ్చాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.

మరొకరికి కరోనా..
ఐపీఎల్ నిర్వహణను పర్యవేక్షించడం కోసం యూఏఈలో ఉన్న బీసీసీఐ బృందంలోని ఓ సభ్యుడికి కరోనా సోకింది. కరోనా సోకిన వ్యక్తి జాతీయ జట్టు సహాయ సిబ్బందిలో సభ్యుడని, సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్ల కోసం అతడు ఇక్కడికి వచ్చాడని మరో బీసీసీఐ అధికారి తెలిపాడు. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు సహా చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన 13 మంది కరోనా బారిన పడ్డారు. ఆటగాళ్లతో ఉండాల్సిన అవసరమున్న వాళ్లు మాత్రమే ఐపీఎల్ బబుల్‌లో ఉండాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. చెన్నైలా ఏ జట్టయినా కరోనా బారిన పడొచ్చని చెప్పాడు.