ఐపీఎల్‌కు సర్వం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య శనివారం జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. గత ఆరు నెలల నుంచి ఎలాంటి క్రికెట్ లేకపోవడం వల్ల అటు అభిమానులు, ఇటు ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. గతేడాది ఫైనల్లో ఈ రెండు జట్లు నువ్వా నేనా అన్నంతగా తలపడ్డాయి. ఒక్క పరుగు తేడాతో ముంబయి ట్రోఫీ సొంతం చేసుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందా? రోహిత్ సేన విజయాల పరంపర కొనసాగిస్తుందా? అనేది చూడాలి.
ఎవరిది పైచేయి?
ఇతర జట్లతో కంటే ముంబయితోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది చెన్నై. ఇప్పటి వరకు ఇరుజట్లు 28 మ్యాచ్‌లు ఆడగా.. అందులో సీఎస్కే 11 సార్లు, ముంబయి 17సార్లు గెలిచింది. మిగిలిన జట్లపై 50 శాతం విజయాలతో ఉన్న ధోనీసేన.. ముంబయి ఇండియన్స్‌పై మాత్రం ఆస్థాయి ప్రదర్శన చేయలేకపోయింది.
చెన్నై బలాలు, బలహీనలు
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన ధోనీ.. ఈ ఐపీఎల్‌తో తిరిగి మైదానంలో తిరిగి అడుగుపెట్టనున్నాడు. దీంతో టోర్నీ మరింత రసవత్తరంగా సాగనుందని అందరూ భావిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో రైనా, హర్భజన్ సింగ్ లీగ్ నుంచి తప్పుకున్నారు. ఫలితంగా చెన్నై జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. దీంతో రైనా స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది పెద్ద ప్రశ్న. అత్యుత్తమ బౌలర్లతో పాటు, అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్ ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం.
ముంబయి పరిస్థితి ఏంటి?