చెన్నై వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ వేలంలో భారత బౌలర్ హర్భజన్ సింగ్‌ను రూ.2 కోట్లకు కోల్‌కతా జట్టు దక్కించుకుంది. ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్నూ కేకేఆర్.. రూ.75 లక్షలకు సొంతం చేసుకుంది. కరుణ్ నాయర్‌నూ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.
కేకేఆర్‌కు భజ్జీ.. సన్‌రైజర్స్ గూటికి జాదవ్
ఐపీఎల్ వేలంలో టీమ్ఇండియా బౌలర్ హర్భజన్ సింగ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. మొదటి రౌండ్లో అతన్ని తీసుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు విముఖత చూపాయి.
కేకేఆర్‌లోకి భజ్జీ.. సన్‌రైజర్స్ గూటికి జాదవ్
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్‌ను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. రూ.50 లక్షల కనీస విలువకు అతన్ని కొనుగోలు చేసింది.
కేదార్ జాదవ్‌ను రూ.2 కోట్లకు సన్‌రైజర్స్ దక్కించుకుంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కూడా సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. రూ.1.5 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. సామ్ బిల్లింగ్స్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు దక్కించుకుంది.
Last Updated : Feb 18, 2021, 8:50 PM IST