మార్చి 23న ఆరంభం కానుంది ఐపీఎల్ పన్నెండో సీజన్. రాత్రి మ్యాచ్లు 8 గంటలకు, సాయంత్రం మ్యాచ్లు 4గంటలకు ప్రారంభమవుతాయని బీసీసీఐ పాలక మండలి చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. ఫ్లే ఆఫ్స్, ఫైనల్స్ మాత్రమే 7 గంటలకు జరుగుతాయని పేర్కొన్నారు.
రాత్రి 8 గంటలకే..! - vinod roy
ఐపీఎల్ రాత్రి మ్యాచ్లు ఏ సమయానికి ప్రారంభం అవుతాయి? 7 గంటలకా ? 8 గంటలకా ? ఈ అనుమానాలకు తెరదించింది బీసీసీఐ.

సాయంత్రం మ్యాచ్లు జరిగేది రాత్రి 8 గంటలకు
రాత్రి మ్యాచ్లు 7 గంటలకే ఆరంభించాలనే విషయమై బీసీసీఐ చర్చలు జరిపింది. ఎక్కువ జట్లు పాత సమయాన్నే కొనసాగించాలని కోరాయి.
కొద్ది రోజుల క్రితం రెండు వారాల ఐపీఎల్ మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైతో బెంగళూరు రాయల్స్ జట్టు తలపడనుంది.