ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌కు షాకిచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో బోణీ కొట్టింది. అయితే ఆర్సీబీ విజయంలో ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ కీలకపాత్ర పోషించాడు. ఒత్తిడిలోనూ గొప్పగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోనే ఇతడి బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.
'ఐపీఎల్ లోగో ఇతడిని చూసే డిజైన్ చేశారా?' - ఐపీఎల్ లోగో డివిలియర్స్
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విజయాన్ని అందించాడు ఏబీ డివిలియర్స్. ఈ క్రమంలోనే ఇతడి బ్యాటింగ్‌ను కొనియాడాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.
డివిలియర్స్ బ్యాటింగ్ అద్భుతమని కొనియాడాడు సెహ్వాగ్. అలాగే ఐపీఎల్ లోగోనూ రహస్యంగా డివిలియర్స్ బాదిన షాట్ నుంచే తీసుకున్నట్లు తెలిపాడు. ఏబీడీ షాట్లను చూసి యాజమాన్యం ఈ లోగో డిజైన్ చేసి ఉంటుందని ట్వీట్ చేశాడు.
చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (49), సూర్యకుమార్ (31) ఆకట్టుకున్నారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆఖరి బంతికి విజయం సాధించింది. డివిలియర్స్ 27 బంతుల్లో 48 పరుగులతో సత్తాచాాటాడు.