తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ నిర్వహణపై ఆగస్టు 2న పూర్తి స్పష్టత - ఐపీఎల్ వార్తలు

ఆగస్టు 2న సమావేశం కానున్న ఐపీఎల్ పాలకమండలి.. పలు అంశాల గురించి చర్చించనుంది. దీనితోపాటు పలు విషయాలపై స్పష్టతనివ్వనుంది.

ఆగస్టు 2న పాలకమండలి భేటీ.. ఐపీఎల్​పై పూర్తి స్పష్టత
ముంబయి ఇండియన్స్ జట్టు

By

Published : Jul 28, 2020, 12:41 PM IST

Updated : Jul 29, 2020, 4:11 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్​.. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. భారత్​లో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండటం వల్లే విదేశాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. లీగ్ జరపడం, ఇతర సదుపాయాల గురించి చర్చించేందుకు ఆగస్టు 2న ఐపీఎల్ పాలకమండలి సమావేశం కానుంది. ఈ భేటీకి గంగూలీ, జైషా మినహాయించి మిగతా సభ్యులందరూ హాజరు కానున్నారు. బీసీసీఐలో వీరిద్దరి పదవీకాలం ముగియడమే ఇందుకు కారణం.

ఐపీఎల్ ట్రోఫీ 2020

ఈ సమావేశంలో భాగంగా ఫ్రాంచైజీలకు వచ్చే నష్టం, బయో సెక్యూర్​ విధానంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​ల నిర్వహణ గురించి ప్రధానంగా చర్చించనున్నారు.

అయితే యూఏఈ వెళ్లే క్రికెటర్లతో పాటు వారి కుటుంబాలను పంపించాలా? వద్దా? అనే విషయమై ఫ్రాంచైజీలు తర్జనభర్జన పడుతున్నాయి. దీనిలో పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాయి.

యూఏఈలో జరగనున్న ఐపీఎల్
Last Updated : Jul 29, 2020, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details