ఈ ఏడాది ఐపీఎల్ వేదికలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంపిక చేసిన స్టేడియాల్లో మాత్రమే మ్యాచ్లు నిర్వహించనున్నారనే సమాచారం బయటకు వచ్చింది. దీంతో తమ రాష్ట్రాల్లోని మ్యాచ్లు నిర్వహించాలని తెలంగాణ మంతి, పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు.
ఐపీఎల్ వేదికలపై ఇంకా వీడని సస్పెన్స్ - ipl bcci
ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించే మైదానాల్ని త్వరలో ఖరారు చేయనున్నారు. ఏ విషయమైనా సరే పాలకమండలి భేటీ ముగిసిన తర్వాతే చెప్పగలమని బీసీసీఐ అధికారి అన్నారు.
![ఐపీఎల్ వేదికలపై ఇంకా వీడని సస్పెన్స్ IPL GC to take final call on venues: BCCI official](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10849825-1089-10849825-1614750259930.jpg)
ఐపీఎల్ వేదికలపై ఇంకా వీడని సస్పెన్స్
తాము ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని గమనిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. త్వరలో జరగబోయే ఐపీఎల్ పాలక మండలి సమావేశం అనంతరం, రాష్ట్రాల అనుమతి తీసుకున్న తర్వాతే వేదికల విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఇవీ చదవండి: