సుమారు 106 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ ఏడాది కొనుగోళ్లకు సిద్ధమయ్యాయి ఫ్రాంచైజీలు. జైపూర్‌లో 2018 డిసెంబర్లో ఐపీఎల్ 12వ సీజన్ వేలంపాట జరిగింది. ఇందులో ఐదుగురు ప్రముఖ క్రికెటర్లు ఒక టీం నుంచి మరో టీంకు మారారు.
- డికాక్.. బెంగళూరు నుంచి ముంబయి
2019 వేలంపాటలో మొదటి ఆటగాడు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌ను 2.8 కోట్లకు దక్కించుకుంది ముంబయి ఇండియన్స్ యాజమాన్యం. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (2.2 కోట్లు), శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ అఖిల ధనంజయ (50 లక్షలు)ను వదులుకుని ఈ కొనుగోలు చేసింది.
విండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్, సారథి రోహిత్ శర్మతో పాటు డికాక్ రాకతో ముంబయి టాప్ ఆర్డర్ బలంగా తయారైంది. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాడు డికాక్. ఈ మెగా టోర్నీకి ముందు వన్డేల్లో 5 మ్యాచ్‌ల్లో 353 పరుగులు చేసిన ఈ సఫారీ బ్యాట్స్‌మెన్...శ్రీలంకతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలోప్రధానపాత్ర పోషించాడు.
- శిఖర్ ధావన్.. సన్‌రైజర్స్ నుంచి దిల్లీ క్యాపిటల్స్
మొదట దిల్లీ తరఫున ఆడిన ధావన్.. ఆ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ ఐపీఎల్లో మళ్లీ సొంత గూటికే చేరాడు.
దిల్లీ క్యాపిటల్స్ తరఫున శిఖర్‌ధావన్ విజయ్ శంకర్, షహ్బాజ్ నదీమ్, అభిషేక్ శర్మ వంటి ముగ్గురు ఆటగాళ్లను వదులుకొని ఆ ధరకు ధావన్‌ను దక్కించుకుంది దిల్లీ క్యాపిటల్స్. రూ.5 కోట్లతో అక్షర్ పటేల్‌నూ కొనుగోలు చేసింది ఈ ప్రాంఛైజీ . - స్టాయినిస్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2018 వేలంలో స్టాయినిస్‌ను దక్కించుకోలేకపోయిన బెంగళూరు ఈ ఏడాది 6.20 కోట్ల ధరకు కొనుక్కుంది. ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కోసం మన్దీప్ సింగ్‌ను వదులుకుందీ జట్టు.
స్వదేశంలో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో స్టాయినిస్ అద్భుత ప్రదర్శన చేశాడు. 0-2తో వెనుకబడి ఉన్నఆసిస్... చివరి మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ గెలుచుకోవడంలో ముఖ్య పాత్ర వహించాడు. ఒక మ్యాచ్‌లో 140 పరుగులతో ఆకట్టుకున్నాడు. బిగ్‌బాష్ టోర్నమెంటులో మూడో అత్యధిక స్కోరర్‌గా నిలవడం బెంగళూరుకు కలిసొచ్చే అంశం.
- యువరాజ్ సింగ్.. పంజాబ్ నుంచి ముంబయి ఇండియన్స్
2018 టోర్నమెంటులో ఎనిమిది మ్యాచ్‌ల్లో 65 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చిన యువరాజ్‌సింగ్‌పై ఈ ఏడాది ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు ముంబయి ఇండియన్స్ కోటి రూపాయల నామమాత్ర ధరకు సొంతం చేసుకుంది. గతంలో 12 కోట్లతో వేలంలో అత్యధిక ధర పలికిన ఈ హిట్టర్ ఇంత తక్కువ ధర పలకడం ఆశ్చర్యకరం. మంచి అనుభవం ఉన్న ఆటగాడు, మిడిలార్డర్లో రాణించగలడనే భరోసాతోనే యాజమాన్యం యువీని దక్కించుకుంది.
ముంబయి ఇండియన్స్ తరఫున యువీ - మార్టిన్ గప్తిల్, బెయిర్‌స్టో....సన్‌రైజర్స్
గప్తిల్, బెయిర్ స్టో రూపంలో సన్‌రైజర్స్‌కు బలమైన ఓపెనర్లు దొరికారు. ధావన్ లేని లోటు తీర్చేందుకు వీరు ఉపయోగపడతారని ఫ్రాంఛైజీ భావిస్తోంది.
- తొలిసారి ఐపీఎల్ వేలంలో పాల్గొన్న బెయిర్ స్టోను 2.2 కోట్లకు దక్కించుకుంది సన్‌రైజర్స్. ఈ ఇంగ్లండ్ ఆటగాడు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా ప్రభావం చూపించగలడు.
- గప్తిల్‌ను కోటి రూపాయలకు రెండో రౌండ్లో కొనుగోలు చేసింది సన్‌రైజర్స్. ఈ కివీస్ ఓపెనర్ చాలా సీజన్ల తరవాత మళ్లీ ఐపీఎల్లో అడుగుపెడుతున్నాడు. భారత్‌లో గప్తిల్‌కు మంచి రికార్డు ఉంది. హిట్టర్‌గానూ టీ20ల్లో నిరూపించుకున్నాడీ విధ్వంసకర ఓపెనర్.