తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ ట్విస్ట్: ఫైనల్​ తేదీలో మార్పు - IPL LATEST NEWS

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్​ అనుకున్న తేదీ కంటే రెండు రోజుల ఆలస్యంగా నిర్వహించనున్నారట. ఈ విషయమై ఐపీఎల్ పాలకమండలి భేటీ తర్వాత స్పష్టత రానుంది.

ఐపీఎల్ ట్విస్ట్: ఫైనల్​ తేదీలో మార్పు
ముంబయి ఇండియన్స్

By

Published : Jul 30, 2020, 9:38 PM IST

కరోనా ప్రభావంతో నిరవధిక వాయిదా పడ్డ ఐపీఎల్‌.. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తున్నట్లు గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ గతవారం చెప్పారు. అయితే ఫైనల్​పై కొత్త ట్విస్టు తెరపైకి వచ్చింది. రెండు రోజుల ఆలస్యంగా ఈ మ్యాచ్​ను నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం. త్వరలో జరిగే పాలకమండలి సమావేశంలో దీని గురించి చర్చించనున్నారు.

ఐపీఎల్ ట్రోఫీ

అయితే, ఫైనల్‌ను వాయిదా వేయడానికి తగిన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ రెండు వారాలు క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొనడం వల్ల ఆటగాళ్లు ముందుగానే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ఫైనల్‌ను రెండు రోజులు వాయిదా వేస్తే తర్వాత భారత జట్టును స్వదేశానికి తీసుకురాకుండా నేరుగా ఆస్ట్రేలియాకు తరలించడం సురక్షితమని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా ఇలా జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఆ ఫైనల్‌ కన్నా ముందే పలువురు ఆటగాళ్లు తమ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నా అక్కడే ఉంటారని, టోర్నీ మొత్తం పూర్తయ్యాకే జట్టంతా కలిసి ఆస్ట్రేలియాకు పయనమవుతుందని ఓ అధికారి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details