తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్ భారత క్రికెట్ దశను మార్చింది' - 'ఐపీఎల్ భారత క్రికెట్ దశను మార్చింది అఫ్రిది

యువ ఆటగాళ్లకు టీ20లు చాలా బాగా ఉపయోగపడతాయని అన్నాడు పాకిస్థాన్ మాజీ ఆల్​రౌండర్ షాహిద్ అఫ్రిది. ఐపీఎల్ భారత క్రికెట్ దశను మార్చిందని తెలిపాడు.

అఫ్రిది
అఫ్రిది

By

Published : Feb 24, 2020, 9:26 AM IST

Updated : Mar 2, 2020, 9:11 AM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) భారత క్రికెట్‌ దశను మార్చేసిందని పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. త్వరలోనే భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"ఐపీఎల్‌తో భారత క్రికెట్‌ దశ తిరిగింది. భారత యువ ఆటగాళ్లు అగ్రశ్రేణి విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడటం, అంతేకాక వారితో డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకోవడం వల్ల.. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు. ఒత్తిడిలో ఎలా సమర్థవంతంగా పోరాడాలో ఐపీఎల్‌లో తెలుసుకున్నారు. భారత క్రికెట్‌ను ఐపీఎల్‌ ఎలా మార్చేసిందో పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) కూడా పాక్‌ క్రికెట్‌ను మార్చేస్తుందని భావిస్తున్నా. ఇప్పటికే ఎంతోమంది యువ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌తో వెలుగులోకి వచ్చారు. స్టేడియంలో వేలాదిమంది ప్రేక్షకుల మధ్య అనుభవజ్ఞులైన విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడితే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో తెలుసుకోవచ్చు. ఫిట్‌గా ఉన్నంత వరకు నేను పొట్టి లీగ్‌ల్లో కొనసాగుతా."

-అఫ్రిది, పాకిస్థాన్ మాజీ ఆల్​రౌండర్

ఐపీఎల్‌తో ఎంతోమంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, రిషభ్‌ పంత్‌.. వంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో సత్తా చాటే టీమిండియా తలుపు తట్టారు. మార్చి 29 నుంచి ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం కానుంది.

Last Updated : Mar 2, 2020, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details