తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ కంటే ప్రాణాలు ముఖ్యం: రైనా - Suresh Raina About Dhoni

కరోనా వైరస్ ప్రభావంతో ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అయితే ఈ మహమ్మారిని అరికట్టే వరకు లీగ్ సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా క్రికెటర్ సురేశ్ రైనా. ఐపీఎల్ కంటే ప్రాణాలు ముఖ్యమని తెలిపాడు.

Suresh Raina
రైనా

By

Published : Apr 4, 2020, 11:26 AM IST

కరోనా వైరస్‌ను అరికట్టే వరకూ ఐపీఎల్‌ నిర్వహించడం సాధ్యం కాదని టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటున్న నేపథ్యంలో ఐపీఎల్‌ కోసం అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాలని అన్నాడు.

"జీవితం ఎంతో ముఖ్యం. ఐపీఎల్‌కు ఇంకా సమయం ఉంది. లాక్‌డౌన్‌లో ప్రభుత్వ సూచనలను అందరూ పాటించాలి. ముందు జీవితం బాగుండాలి. తర్వాత ఐపీఎల్‌ గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ప్రాణాల్ని కాపాడుకోవాలి."

-రైనా, టీమ్​ఇండియా క్రికెటర్

లాక్​డౌన్ వల్ల లభించిన ఖాళీ సమయంలో సరదాగా గడుపుతున్నానని చెప్పాడు రైనా. ప్రస్తుతం బంగ్లాలు, ఖరీదైన కార్ల కంటే మూడు పూటల భోజనం ముఖ్యమని తెలిపాడు.

"లాక్‌డౌన్‌తో ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. క్రికెట్‌ కంటే జీవితంలో గొప్ప క్షణాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలతో సమయాన్ని గడుపుతున్నాను, వంట చేస్తున్నాను. ప్రస్తుతం ఖరీదైన కార్లు, బంగ్లాలు, నువ్వు ధరించే దుస్తుల కంటే మూడు పూటల భోజనం ముఖ్యం. లాక్‌డౌన్‌లో ప్రజలంతా వాస్తవాన్ని తప్పక తెలుసుకుంటారు."

-రైనా, టీమ్​ఇండియా క్రికెటర్

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ధోనీతో కలిసి రైనా మార్చి నుంచే సాధన మొదలుపెట్టాడు. కానీ, మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15వరకు వాయిదా వేశారు. ఫలితంగా ప్రాక్టీస్‌ను కూడా ఆపేశారు.

"శిక్షణ గొప్పగా సాగింది. కానీ మహమ్మారి కారణంగా ఆగిపోయింది. శిక్షణలో ధోనీతో కలిసి ప్రాక్టీస్‌ చేశా. నెట్స్‌లో అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. యువకుడిలా చెలరేగుతున్నాడు. ఒక సెషన్‌లో అతడు విరామం లేకుండా మూడు గంటలు బ్యాటింగ్‌ చేశాడు" అని రైనా తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details