చెన్నై వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో 'శతక' ప్రదర్శన చేశాడు వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్. తాజాగా ఇతడు ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే భారత్‌తో జరగనున్న చివరి రెండు వన్డేల్లో సత్తా చాటి.. తొలి రెండు స్థానాల్లో ఉన్న విరాట్-రోహిత్‌ను అధిగమించడమే లక్ష్యమని చెప్తున్నాడీ కరీబియన్ స్టార్.
వేలం రెండో ప్రాధాన్యం...
విశాఖపట్నం వేదికగా రేపు (డిసెంబర్ 18న) రెండో వన్డేలో తలపడనున్నాయి భారత్-విండీస్ జట్లు. ఈ మ్యాచ్ తర్వాత 19న కోల్‌కతాలో ఐపీఎల్-2020 వేలంపాట జరగనుంది. అయితే తన తొలి ప్రాధాన్యం వన్డేలని తర్వాతే ఐపీఎల్ వేలంపాట అని చెప్పాడు హోప్.
"కచ్చితంగా ఐపీఎల్ వేలానికి సంబంధించి చాలా మందికి ఒత్తిడి ఉంటుంది. కానీ నాకైతే అలా కాదు. భారత్‌తో సిరీస్ ముఖ్యమైంది. ఇక్కడ పరుగులు చేయడమే నా ముందున్న లక్ష్యం. ఈ క్రమంలోనే కోహ్లీ, రోహిత్‌ల రికార్డులను బ్రేక్ చేయాలని ఉంది".
-షై హోప్, వెస్టిండీస్ క్రికెటర్