తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ వేలం.. ఏ జాబితాలో ఎవరు? - ఐపీఎల్ వేలం ఏ జాబితాలో ఎవరు

ఐపీఎల్ వేలం మరికొద్ది గంటల్లో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఏ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారు? వేలాన్ని ఎక్కడ చూడొచ్చు వంటి విషయాలు తెలుసుకుందాం.

IPL Auction
ఐపీఎల్ వేలం

By

Published : Feb 18, 2021, 12:51 PM IST

ఐపీఎల్ వేలం మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్ల లిస్టును సిద్ధం చేసుకున్నాయి. తమ జట్టు కూర్పును మెరుగుపర్చుకునేలా ప్రణాళికలు రచించాయి. మొత్తం 292 మంది ఈ వేలంలో పాల్గొననున్నారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లు కాగా, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అత్యధిక ధర 2 కోట్ల జాబితాలో 10 మంది ఉండగా మార్క్ వుడ్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఏ జాబితాలో ఎంతమంది ఉన్నారో చూద్దాం.

2 కోట్లు

హర్భజన్ సింగ్​, కేదార్ జాదవ్, మ్యాక్స్​వెల్, స్టీవ్ స్మిత్, షకిబుల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్.

మ్యాక్స్​వెల్

1.5 కోట్లు

అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, అలెక్స్ కారే, నాథన్ కౌల్టర్​ నీల్, జే రిచర్డ్​సన్, ముజిబుర్ రెహ్మన్, అదిల్ రషీద్, షాన్ మార్ష్, టామ్ కరన్, డేవిడ్ విల్లే, లూయిస్ జార్జీ, మోర్నే మోర్కెల్.

1 కోటి

ఆరోన్ ఫించ్, ఎవిన్ లూయిస్, హనుమ విహారి, షెల్డన్ కాట్రెల్, ముస్తఫిజుర్ రెహ్మన్, ఉమేశ్ యాదవ్, మోసెస్ హెన్రిక్స్, మార్నిస్ లబుషేన్, జాసన్ బెహ్రండాఫ్, బిల్లీ స్టాన్​లేక్, మాథ్యూ వేడ్.

స్మిత్

75 లక్షలు

క్రిస్ మోరిస్, కోరే ఆండర్సన్, డారెన్ బ్రావో, బెన్ కటింగ్, కైలీ జేమిసన్, ఫాబియాన్ అలెన్, డాన్ క్రిస్టియన్, లివింగ్​స్టోన్, టిమ్ సౌథీ, కీమో పాల్, ఫిడెల్ ఎడ్వర్ట్స్, మహ్మద్ మహ్మదుల్లా, షెర్ఫేన్ రూథర్​ఫర్డ్, హిల్టన్ కాట్ రైట్, జేమ్స్ ఫాల్క్​నర్.

ప్రత్యక్ష ప్రసారం ఎప్పుడు?

నేడు (గురువారం) చెన్నై వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఐపీఎల్ 14వ సీజన్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్​ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్​డీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ హెచ్​డీ 3 ఛానల్లో ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. అలాగే హాట్​స్టార్ డిజిటల్ ప్లాట్​ఫామ్​లో చూడొచ్చు.

ABOUT THE AUTHOR

...view details