చెన్నై వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో బెంగళూరుకు ఆడిన అలీని తాజాగా సీఎస్కే దక్కించుకుంది.
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు ఏడు సీజన్లలో షకిబ్ ఇదే జట్టుకు ఆడాడు. చివరగా సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.