చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా బౌలర్ జే రిచర్డ్సన్ రూ.14 కోట్లకు అమ్ముడుపోయాడు. కోటిన్నర రూపాయల బేస్ ప్రైస్‌తో ఉన్న ఈ ఆసీస్ బౌలర్‌ను పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది.
న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నేను ముంబయి జట్టు కొనుగోలు చేసింది. రూ.50 లక్షల కనీస విలువ జాబితాలో ఉన్న మిల్నేను రూ.3.20 కోట్లకు ముంబయి దక్కించుకుంది.