చెన్నై వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ వేలంలో యువ ఆల్‌రౌండర్ క్రిష్ణప్ప గౌతమ్ భారీ ధరకు అమ్ముడయ్యాడు. రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో పాల్గొన్న ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి రూ.9.25 కోట్ల రికార్డు ధరకు చెన్నై జట్టు ఇతడిని సొంతం చేసుకుంది. లీగ్ చరిత్రలో ఓ అన్క్యాప్డ్ ప్లేయర్‌కు ఇంత ధర దక్కడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు కృనాల్ పాండ్యా 8.8 కోట్లే అత్యధికం.
మరో యువ క్రికెటర్ షారుక్ ఖాన్‌ను పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న ఈ వికెట్ కీపర్‌ను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి రూ.5.25 కోట్లకు పంజాబ్ ఇతడిని దక్కించుకుంది.