సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా ప్రధాన బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా ఎట్టకేలకు తిరిగి ఐపీఎల్లో ఆడనున్నాడు. గురువారం చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. రూ.50 లక్షల బేస్ ప్రైస్‌కే అతన్ని సొంతం చేసుకుంది.
"వేలం ద్వారా లెజెండ్ ఛెతేశ్వర్ను మేం సీఎస్కేలోకి చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం. విజిల్‌పోడు. సూపర్ ఆక్షన్." అని సీఎస్కే తన అధికారిక ట్విట్టర్ పేజీలో రాసుకుంది.
గత నెలలో ఐపీఎల్ ఆడాలన్న తన అభిలాషను వ్యక్తం చేశాడు పుజారా. టెస్టు క్రికెట్‌కు సరిగ్గా సరిపోయే అతని బ్యాటింగ్ శైలి వల్ల అతనికి పొట్టి ఫార్మాట్లో అంతగా అవకాశాలు రాలేదు.