వచ్చే సీజన్ కోసం జరిగే ఐపీఎల్ వేలం.. కోల్‌కతా వేదికగా గురవారం జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గాముంబయి ఇండియన్స్ బరిలో దిగుతోంది. ప్రతిభావంతులైన అనామక క్రికెటర్లపైనే ఎక్కువగా ఈ జట్టు దృష్టిపెడుతుంది. అవసరమైతే అధిక మొత్తం ఖర్చు చేసేందుకు వెనకాడదు. నాలుగుసార్లు ఛాంపియన్ అయిన ముంబయి.. ఈ సారి ఐదుగురు స్వదేశీ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తోంది.
అంటిపెట్టుకున్న క్రికెటర్లు
రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, డికాక్, మిచెల్ మెక్లనగన్, బుమ్రా, లసిత్ మలింగ, కృనాల్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్, అన్మోల్ ప్రీత్ సింగ్, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్, అనుకుల్ రాయ్, ఆదిత్య తారే, జయంత్ యాదవ్
- ట్రేడెడ్ ఇన్:ట్రెంట్ బౌల్ట్(దిల్లీ నుంచి), రూథర్‌ఫర్డ్(దిల్లీ నుంచి), ధవల్ కుల్కర్ణి(రాజస్థాన్ నుంచి)
వదులుకున్న ఆటగాళ్లు: యువరాజ్ సింగ్, లూయిస్, ఆడమ్ మిల్నే, జేసన్ బెహ్రన్‌డార్ఫ్, బరిందర్ శరణ్, బెన్ కటింగ్, అల్జారీ జోసెఫ్, హెండ్రిక్స్, రషీక్ సలామ్, పంకజ్ జైస్వాల్
- ట్రేడెడ్ ఔట్:మయాంక్ మార్కండే(దిల్లీకి), సిద్ధేశ్ లాడ్(కోల్‌కతాకు)
ఉన్న నగదు: రూ.13.05 కోట్లు