తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహీని అమ్మడం మర్చిపోలేను: రిచర్డ్ మ్యాడ్లే - Richard Madley Auctioneer

తన కెరీర్​లో ఎంతో మందికి వేలం నిర్వహించానని, అయితే మహేంద్ర సింగ్ ధోనీని చెన్నై సూపర్​ కింగ్స్ జట్టుకు విక్రయించడాన్ని మర్చిపోలేనని చెప్పాడు మాజీ వేలంపాట దారుడు రిచర్డ్ మ్యాడ్లీ.

IPL Auction 2020: Ex-auctioneer Richard Madley Reveals Biggest Past Auction Controversies
రిచర్డ్ మ్యాడ్లే

By

Published : Dec 19, 2019, 3:52 PM IST

ఐపీఎల్ 2020 సీజన్ ​కోసం వేలం ప్రారంభమైంది. గత పదేళ్లుగా వేలం పాటదారుడిగా ఉన్న రిచర్డ్ మ్యాడ్లీ ఆసక్తికర విషయాన్ని పంచకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీని చెన్నైకు విక్రయించడాన్ని తన కెరీర్​లో మర్చిపోలేని సంఘటన అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు.

గత పదేళ్లుగా ఐపీఎల్​ వేలంలో ఎంతో మంది ఆటగాళ్లకు వేలం నిర్వహించా. కానీ 2008 ఐపీఎల్ సీజన్​లో మహేంద్ర సింగ్ ధోనీని 1.5 మిలియన్ డాలర్లకు చెన్నై సూపర్ కింగ్స్​కు విక్రయించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపేలేను -రిచర్డ్ మ్యాడ్లీ, ఐపీఎల్ మాజీ వేలంపాట దారుడు

పదేళ్ల పాటు వేలంపాట దారుడిగా పనిచేసిన మ్యాడ్లీ.. 2018లో వివాదస్పద రీతిలో వైదొలిగాడు. ఏటా అదే పని చేయడం తనకు నిరాశ కలిగించిందని, అందుకే తప్పుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇదీ చదవండి: 'ఈ హ్యాట్రిక్ వికెట్లే నా అత్యుత్తమ ప్రదర్శన'

ABOUT THE AUTHOR

...view details