కోల్‌కతాలో ఐపీఎల్ వేలం గురువారం ఆరంభం కానుంది. ఇందుకోసం 971 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. 332 మంది ఎంపికయ్యారు. వీరికి సంబంధించిన జాబితాను బీసీసీఐ ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది. అన్నిజట్లు కలిపి మొత్తం 73 మందిని కొనుగోలు చేయనున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సన్రైజర్స్హైదరాబాద్.. ఈ వేలంలో ఎవరిపై దష్టిపెడుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆల్‌రౌండర్, ఫినిషింగ్ బ్యాట్స్‌మెన్ వైపు రైజర్స్ చూస్తోంది.
అంటిపెట్టుకున్న ఆటగాళ్లు
కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, షాబాజ్ నదీమ్, బిల్లీ స్టాన్లేక్, బసిల్ తంపి, టి.నటరాజన్
వదులుకున్న క్రికెటర్లు
దీపక్ హుడా, మార్టిన్ గప్తిల్, రికీ భుయ్, షకిబ్ అల్ హాసన్, యూసఫ్ పఠాన్
ఉన్న నగదు: రూ.17 కోట్లు
మిగిలున్న స్థానాలు: 7(స్వదేశీ 2, విదేశీ 5)