తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ వేలం 2020: ఫించ్ అరుదైన ఘనత - ఐపీఎల్​ వేలంపాట 2020

ఈ ఏడాది ఐపీఎల్​ వేలంపాటలో ఆస్ట్రేలియా క్రికెటర్​ ఆరోన్​ ఫించ్​ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. రూ.కోటి కనీస ధర కాగా.. 4.4 కోట్లకు ఎంపికయ్యాడు. తాజాగా ఆర్​సీబీ జట్టులో చేరడం వల్ల అన్ని ప్రాంఛైజీల్లో భాగస్వామ్యం పొందిన ఆటగాడిగా ఘనత సాధించాడు.

IPL Auction 2020
ఐపీఎల్​ వేలం 2020: ఎనిమిది ఫ్రాంఛైజీలకు ఒకే ఒక్కడు

By

Published : Dec 19, 2019, 4:28 PM IST

ఐపీఎల్​ వేలం పాటలో ఆస్ట్రేలియా వన్డే సారథి ఆరోన్​ ఫించ్​ అరుదైన ఘనత సాధించాడు. ఈ లీగ్​ చరిత్రలో ఎనిమిది జట్ల తరఫున భాగస్వామ్యం పొందిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఇతడిని దక్కించుకోవడానికి కోల్​కతా నైట్​రైడర్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు పోటీపడ్డాయి. కానీ చివరకి 4.4 కోట్ల ధరకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.

ఆరోన్​ ఫించ్
  • టీ20ల్లో 150+ స్కోరు రెండుసార్లు సాధించిన ఏకైక ఆటగాడు ఫించ్

గతంలో...

ఫించ్​ను గతంలో పలు ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇప్పటివరకు రాజస్థాన్​ రాయల్స్​(2010), దిల్లీ డేర్​డెవిల్స్​(2011-12), పుణె వారియర్స్​(2013), సన్​రైజర్స్ హైదరాబాద్​(2014), ముంబయి ఇండియన్స్​ (2015), గుజరాత్​ లయన్స్​ (2016-17), కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ (2019)కు ఆడాడీ ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్.

ABOUT THE AUTHOR

...view details