14 వ సీజన్ ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 18న జరగనుందని స్పష్టత ఇచ్చింది యాజమాన్యం. చెన్నై వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
త్వరలోనే ఐపీఎల్ వేలం.. తేదీ ఖరారు - ipl auction february 18
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వేలంపై స్పష్టత వచ్చింది. ఫిబ్రవరి 18న భారత్లోనే ఈ కార్యక్రమం జరగనుంది. అప్పుడే.. మెగాలీగ్ను భారత్లో నిర్వహించాలా లేదా 13వ సీజన్ తరహాలోనే మళ్లీ దుబాయ్లో జరపాలా అనే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ఐపీఎల్ వేలం ఆరోజే
ఈ వేలం కార్యక్రమంలోనే మెగాలీగ్ను ఎక్కడ నిర్వహించాలనే విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి ప్రాధాన్యంగా.. భారత్లోనే నిర్వహించేందుకు బోర్డు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించాయి. ఒకవేళ కుదరకపోతే రెండో ఐచ్ఛికంగా ఐపీఎల్-13 సీజన్ తరహాలోనే మళ్లీ దుబాయ్లో జరుపుతారని చెప్పుకొచ్చాయి.
ఇదీ చదవండి:'భారత్తో సిరీస్ కఠిన సవాల్ లాంటిది.. కానీ'
Last Updated : Jan 27, 2021, 2:01 PM IST