ఐపీఎల్ 14వ సీజన్ కోసం దక్షిణాప్రికా ఆటగాళ్లు అన్రిచ్ నోర్జే, కగిసో రబాడా ముంబయి చేరుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నారు. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడారు వీరిద్దరూ. ప్రస్తుతం ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చారు.
"దిల్లీ ఫ్రాంఛైజీకి చేరుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్ల పేర్లు చెప్పండి. తప్పు సమాధానాలు మాత్రమే" అంటూ దిల్లీ క్యాపిటల్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టింది.
వారం రోజుల క్వారంటైన్‌ను ముగించుకున్న దిల్లీ జట్టు గత వారమే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. ముంబయిలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సహాయ కోచ్ మహమ్మద్ కైఫ్ ఆధ్వర్యంలో తమ తొలి సాధన ప్రారంభించింది.
గతేడాది కొద్దిలో టైటిల్ చేజారిందని.. ఈ సారి తప్పక ట్రోఫీ నెగ్గుతామని కైఫ్ తెలిపాడు. ఆటగాళ్లందరూ మంచి రిథమ్‌లో ఉన్నారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఫ్లడ్‌లైట్ల వెలుతురులో క్యాచ్‌ల ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నామని అన్నాడు. ఫీల్డింగ్‌పైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించాడు.
ఇదీ చదవండి:ఎమ్ఐటీలో తొలిసారి క్రికెట్‌పై చర్చ- ద్రవిడ్‌కు ఆహ్వానం