ఐపీఎల్-14వ సీజన్లో మరో రెండు జట్లు కొత్తగా చేరతాయని అంతా అనుకుంటుండగా.. బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది కూడా ఇప్పుడున్న ఎనిమిది జట్లతోనే టోర్నీ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరో రెండు జట్ల చేరికపై పలు ఫ్రాంచైజీలు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. బీసీసీఐ కొత్త జట్ల నిర్ణయాన్ని వాయిదా వేయాలని భావిస్తోంది.
ఐపీఎల్-2021లో పది జట్లు కాదు ఎనిమిదే!
ఐపీఎల్-2021లో పది జట్లు పాల్గొంటాయని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, బీసీసీఐ మాత్రం వచ్చే ఏడాది కూడా 8 జట్లతోనే టోర్నీ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్లో వచ్చే ఏడాది పది కాదు ఎనిమిదే!
అయితే.. 2022లో 10 జట్లతో టోర్నీని నిర్వహించనుంది బీసీసీఐ. డిసెంబర్ 24న అహ్మదాబాద్‌లో జరిగే సాధారణ వార్షిక సమావేశంలో ఈ మేరకు బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. బీసీసీఐ గనుక వచ్చే ఏడాది 8 జట్లతోనే ఐపీఎల్ టోర్నీ నిర్వహిస్తే.. 14వ సీజన్‌కు ముందు భారీ వేలం ఉండదు. దానివల్ల తమకు ఇష్టమైన ఆటగాళ్లను కోల్పోకుండా ఉండేందుకు ఫ్రాంచైజీలకు అవకాశం లభిస్తుంది. బీసీసీఐకి కూడా తన స్పాన్సర్షిప్ టైటిల్‌ను విక్రయించేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది.
Last Updated : Dec 21, 2020, 6:10 PM IST