ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో లీగ్ నిర్వహణపై సందేహాలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ల్ని సజావుగా జరిపేందుకు 50 పేజీలతో కూడిన నిబంధనల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) విడుదల చేసింది.
*ప్రాక్టీసు సెషన్, మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా వీక్షకుడు లేదా అభిమాని.. క్రికెటర్లకు దగ్గరకు వెళ్లాలని ప్రయత్నిస్తే సెక్యూరిటీ గార్డులు అతడిని అదుపులోకి తీసుకుంటారు. సదరు ఆటగాడు వెంటనే తన దుస్తులను మార్చుకోవాల్సి ఉంటుంది.
*బయో బబుల్‌లో ఉన్న సహచర ఆటగాళ్లను కలిసే 20 సెకన్ల ముందు సదరు క్రికెటర్ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ వీక్షకులు ఎవరైనా క్రికెటర్ల కిట్ బ్యాగ్‌ను తాకినా సరే, దానిని శానిటైజ్ చేయాల్సి ఉంటుంది.
*చేతులు శానిటైజ్ చేసుకున్న తర్వాతే సబ్‌స్టిట్యూట్, మైదానంలోకి డ్రింక్స్ తీసుకెళ్లాలి. ఆటగాళ్లు కూడా డ్రింక్స్ తాగడానికి ముందు, తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవాలి.