రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌కు గొప్ప క్రికెట్ పరిజ్ఞానముందని వెల్లడించాడు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్. అతడిని యువ కెప్టెన్‌గా మాత్రమే పరిగణించవద్దని.. అతడిలో ఓ సీరియస్ క్రికెటర్ ఉన్నాడని తెలిపాడు.
"నేను సంజుతో కలిసి రాజస్థాన్, దిల్లీ జట్ల తరఫున ఆడాను. అతడితో నాకు సన్నిహిత సంబంధం ఉంది. సంజుతో కలిసి చాలా సార్లు బ్యాటింగ్ చేశాను. అతడిలో యువ కెప్టెన్‌ను చూడలేదు. మంచి పరిణితి గల క్రికెటర్‌ను చూశాను. సంజుకు గొప్ప క్రికెట్ పరిజ్ఞానం ఉంది" అని క్రిస్ మోరిస్ తెలిపాడు.