తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాడ్​తో వన్డేలకు శ్రేయస్​ దూరం- ఐపీఎల్​కు డౌట్​! - india vs england

ఇంగ్లాండ్​తో తొలి వన్డేలో గాయపడిన భారత యువ బ్యాట్స్​మెన్​ శ్రేయస్ అయ్యర్​.. మిగతా రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఐపీఎల్​ 14వ సీజన్​లోనూ అతడు ఆడేది అనుమానమేనని బీసీసీఐ ప్రకటించింది.

IPL 2021: DC skipper Iyer may undergo surgery, likely to miss full season
మిగతా వన్డేలకు అయ్యర్ దూరం-ఐపీఎల్​కు అనుమానమే

By

Published : Mar 24, 2021, 5:47 PM IST

ఇంగ్లాండ్​తో మిగతా రెండు వన్డేలకు భారత యువ బ్యాట్స్​మెన్ శ్రేయస్​ అయ్యర్​ గాయం కారణంగా దూరం అయ్యాడు. ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్​కు అతడు ఆడేది అనుమానంగానే మారింది. తొలి వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయస్​కు.. ఎడమ చేయి భుజం బెణికింది.

"ఐపీఎల్​లో శ్రేయస్​ ఆడేది అనుమానమే" అని బీసీసీఐ ప్రకటించింది.

డీసీకి ఎదురుదెబ్బ

శ్రేయస్​కు గాయంతో దిల్లీ క్యాపిటల్స్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. ఆ జట్టును ముందుండి నడిపిస్తున్న ఈ యువ బ్యాట్స్​మెన్ టోర్నీకి దూరమైతే టీంపై ఎక్కువ ప్రభావమే పడుతుంది.

ఇంగ్లాండ్​తో మొదటి వన్డేలో బెయిర్​ స్టో కొట్టిన బంతిని.. శ్రేయస్​ డైవ్​ చేసి ఆపబోయాడు. దీంతో అతని ఎడమ చేయి మైదానాన్ని బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన అయ్యర్​.. బాధతో ఫీల్డ్​ను వీడాడు.

ఇదీ చదవండి:శ్రేయస్​కు గాయం- ఐపీఎల్​కు అనుమానం!

ABOUT THE AUTHOR

...view details