ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 జరగనుందని సమాచారం. విజయ్ హజారే, మహిళల వన్డే టోర్నమెంట్ తర్వాత ఐపీఎల్ ప్రారంభంకానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ పాలక మండలి ఈ తేదీనే దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మార్చితో ఇంగ్లాండ్తో.. భారత్ సిరీస్ ముగుస్తున్నందున.. ఏప్రిల్ 11 వరకు క్రికెటర్లకు తగిన విశ్రాంతి లభిస్తుందని బీసీసీఐ అధికారి తెలిపారు. సీజన్ ఫైనల్ జూన్ తొలి వారంలో ఉండనుంది. మార్చి ఆఖరు కల్లా చాలా వరకు అంతర్జాతీయ టోర్నీలు కూడా ముగుస్తాయి. ఏప్రిల్ 11 అయితే.. ప్రయాణం, క్వారంటైన్ నిబంధనలను పూర్తి చేయడం సహా ఫ్రాంఛైజీలకు స్పాన్సర్షిప్ అవసరాల కోసం తగిన సమయం దొరుకుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది..