ఐపీఎల్‌ను కరోనా కలవరం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు కరోనా సోకగా.. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు డేనియల్ సామ్స్ వైరస్ బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. డాక్టర్ల అధ్వర్యంలో అతడు ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది.
"ఏప్రిల్ 7న చేసిన రెండో టెస్టులో డేనియల్ సామ్స్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతడికి లక్షణాలు ఏమీ లేవు. డాక్టర్ల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడికి ఆర్సీబీ డాక్టర్లు చికిత్స అందిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తారు."