చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్నెస్ గురించి అప్డేట్ ఇచ్చాడు సీఎస్కే ఫీల్డింగ్ కోచ్ రాజీవ్ కుమార్. ప్రతి సెషన్‌కు మహీ ఒక నిర్దిష్ట ప్రణాళికను పెట్టుకుని.. దాని ప్రకారం ఆడతాడని వెల్లడించాడు.
"ఎంఎస్ ధోనీ ఎంత స్మార్టో తెలుసా? అతడు తన శరీరాన్ని అర్థం చేసుకుంటాడు. తన ఆటను అర్థం చేసుకుంటాడు. 40 ఏళ్ల వ్యక్తులు బంతిని సరిగా స్పష్టంగా అంచనా వేయలేరు. ధోనీ సంకల్పం చూడటానికి బాగుంది ."
-రాజీవ్ కుమార్, సీఎస్కే ఫీల్డింగ్ కోచ్
ఈ దఫా లీగ్‌లోని అన్ని జట్ల కంటే ముందే సాధన మొదలు పెట్టింది చెన్నై. వారం క్రితం నుంచే ధోనీ, రాయుడు సహా కొత్త కుర్రాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.
గత ఐపీఎల్లో కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది సీఎస్కే. ఐపీఎల్ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి. బ్యాటింగ్‌లోనూ ధోనీ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
చివరిసారిగా 2020 నవంబర్‌లో మైదానంలో కనిపించిన మహీ.. ఇంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 14వ సీజన్‌కు నెల రోజుల ముందు నుంచే సాధన మొదలు పెట్టాడు.
ఇదీ చదవండి:'పంత్, కిషన్.. కోహ్లీని చూసి నేర్చుకోండి'