తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్-2021 వేలం: ఈ విషయాలు తెలుసుకోండి! - ipl auction

ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధమైంది. ఈ ఆక్షన్​లో పాల్గొనే తుది ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది పాలకమండలి. కొందరు ఆటగాళ్లు అత్యధికంగా రూ. 2 కోట్ల జాబితాలో ఉండగా.. మరికొందరు అనూహ్యంగా వేలానికి ఎంపికకాలేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్​లో పాల్గొనబోయే ఆటగాళ్లు, ఫ్రాంచైజీల వద్ద ఉన్న మిగులు బడ్జెట్ తదితర వివరాలు తెలుసుకుందాం.

ipl-2021-auction
ఐపీఎల్-2021 వేలం: ఈ విషయాలు తెలుసుకోండి!

By

Published : Feb 18, 2021, 8:01 AM IST

ఐపీఎల్ 14వ సీజన్​ కోసం జరిగే వేలం కోసం అన్ని జట్లు సమాయత్తమవుతున్నాయి. వికెట్ కీపర్, టాపార్డర్, మిడిలార్డర్, బౌలింగ్ దళం.. ఇలా అన్ని విభాగాలను పటిష్ఠం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఐపీఎల్​లో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను ప్రకటించింది పాలకమండలి. మొత్తం 292 మంది ఈ వేలంలో పాల్గొననున్నారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లు కాగా, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల బడ్జెట్ రేంజ్ ఎంత? ఫ్రాంచైజీల వద్ద ఉన్న బడ్జెట్ ఎంత? ఒక్కో ఫ్రాంచైజీ ఎంతమందిని తీసుకోగలదు? అనే విషయాలు తెలుసుకుందాం.

ఏ కేటగిరిలో ఎంతమంది?

మొత్తంగా 113 మంది క్యాప్​డ్ ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకోగా 2 కోట్ల జాబితాలో 10 మంది, 1.5 కోట్ల జాబితాలో 12 మంది, 1 కోటి జాబితాలో 11 మంది, 75 లక్షల కేటగిరీలో 15 మంది, 50 లక్షల కేటగిరీలో 65 మంది ఉన్నారు. సచిన్ తనయుడు అర్జున్ తెందుల్కర్​తో పాటు మరికొందరు రూ. 20 లక్షల జాబితాలో చోటు సంపాదించారు.

ఏ జట్టు ఎంతమందిని తీసుకోవచ్చు?

అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద 11 స్లాట్స్ ఉన్నాయి. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (9), రాజస్థాన్ రాయల్స్ (8), కోల్​కతా నైట్​రైడర్స్ (8), సన్​రైజర్స్ హైదరాబాద్ (3) స్లాట్స్ మిగిలి ఉన్నాయి. పంజాబ్ వద్ద అత్యధికంగా 53.1 కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా.. సన్​రైజర్స్ వద్ద తక్కువగా 10.75 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉంది.

ఫ్రాంచైజీల వారిగా వివరాలు.

ఫ్రాంచైజీల వద్ద ఉన్న మిగులు బడ్జెట్

ధరల వారిగా ఆటగాళ్లు

2 కోట్లు

హర్భజన్ సింగ్​, కేదార్ జాదవ్, మ్యాక్స్​వెల్, స్టీవ్ స్మిత్, షకిబుల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్​ వుడ్.

1.5 కోట్లు

అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, అలెక్స్ కారే, నాథన్ కౌల్టర్​ నీల్, జే రిచర్డ్​సన్, ముజిబుర్ రెహ్మన్, అదిల్ రషీద్, షాన్ మార్ష్, టామ్ కరన్, డేవిడ్ విల్లే, లూయిస్ జార్జీ, మోర్నే మోర్కెల్.

1 కోటి

ఆరోన్ ఫించ్, ఎవిన్ లూయిస్, హనుమ విహారి, షెల్డన్ కాట్రెల్, ముస్తఫిజుర్ రెహ్మన్, ఉమేశ్ యాదవ్, మోసెస్ హెన్రిక్స్, మార్నిస్ లబుషేన్, జాసన్ బెహ్రండాఫ్, బిల్లీ స్టాన్​లేక్, మాథ్యూ వేడ్.

75 లక్షలు

క్రిస్ మోరిస్, కోరే ఆండర్సన్, డారెన్ బ్రావో, బెన్ కటింగ్, కైలీ జేమిసన్, ఫాబియాన్ అలెన్, డాన్ క్రిస్టియన్, లివింగ్​స్టోన్, టిమ్ సౌథీ, కీమో పాల్, ఫిడెల్ ఎడ్వర్ట్స్, మహ్మద్ మహ్మదుల్లా, షెర్ఫేన్ రూథర్​ఫర్డ్, హిల్టన్ కాట్ రైట్, జేమ్స్ ఫాల్క్​నర్.

ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లు

ముంబయి ఇండియన్స్‌:కౌల్టర్‌నీల్‌, మెక్లెనగన్‌, రూథర్డ్‌ఫోర్డ్‌, ప్యాటిన్సన్‌, దిగ్విజయ్‌, ప్రిన్స్‌ బల్వంత్‌, మలింగ (రిటైర్డ్‌).

కోల్‌కతా నైట్‌రైడర్స్‌:సిద్ధార్థ్‌, నిఖిల్‌ నాయక్‌, సిద్దేశ్‌ లాడ్‌, క్రిస్‌ గ్రీన్‌, బాంటన్‌.

దిల్లీ క్యాపిటల్స్‌:కీమో పాల్‌, సందీప్‌ లమిచానె, అలెక్స్‌ కారే, మోహిత్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే, జేసన్ రాయ్.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: సంజయ్‌ యాదవ్‌, సందీప్‌ భవనక, బిల్లీ స్టాన్‌లేక్‌, ఫాబియాన్‌ అలెన్‌, పృథ్వీరాజ్‌.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌:మ్యాక్స్‌వెల్‌, కాట్రెల్‌, కృష్ణప్ప గౌతమ్‌, ముజిబుర్‌ రెహ్మన్‌, జిమ్మీ నీషమ్‌, విల్జోయెన్‌, కరుణ్‌.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు:క్రిస్‌ మోరిస్‌, ఆరోన్‌ ఫించ్‌, మొయిన్‌ అలీ, ఉదాన, శివమ్‌ దూబె, ఉమేశ్‌ యాదవ్‌, పవన్‌ నేగి, గుర్‌కీరత్‌. స్టెయిన్‌ తప్పుకోగా.. పార్థివ్‌ పటేల్‌ రిటైరయ్యాడు.

రాజస్థాన్‌ రాయల్స్‌:స్టీవెన్‌ స్మిత్‌, అంకిత్‌ రాజ్‌పుత్​‌, ఒషానే థామస్‌, వరుణ్‌ ఆరోన్‌, టామ్‌ కరన్‌, అనిరుద్ధ జోషి, ఆకాశ్‌ సింగ్‌, శశాంక్‌ సింగ్‌.

చెన్నై సూపర్‌కింగ్స్‌:కేదార్‌ జాదవ్‌, షేన్‌ వాట్సన్‌ (రిటైర్డ్‌), పీయూష్‌ చావ్లా, మురళీ విజయ్‌, మోను కుమార్‌, హర్భజన్‌.

ఇదీ చదవండి:తొలి టీ20 మ్యాచ్ ఆడింది ఈరోజే

ABOUT THE AUTHOR

...view details